ఓ అద్బుతం జరిగిన వేళ..

కొన్ని పాటలు అలా ఆదమరుపుగా ఏ ప్రక్కింట్లోంచో విన్నా…ఆపు అంతూ లేకుండా రోజుల తరబడి మన హృదయంలో రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ పాట ఏంటో..ఎవరు పాడారో తెలుసుకునేదాకా మనస్సు ఆగదు. అటువంటి అరుదైన గీతాల్లో ఒకటి “గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం…” . జగద్గురు శ్రీ భారతి తీర్ధ మహాస్వామి వారి చే స్వరపరచబడిన ఈ గీతం ఇప్పుడు చాలా ఇళ్లలో ప్రభాత సమయాన వినే భక్తి గీతం అయ్యింది. మరి కొంతమందికి రింగ్ టోన్ గా మారింది. ఈ గీతాన్ని ఇంతలా జనసామాన్యంలోకి తెచ్చింది ఎవరూ అంటే మొహమాటం లేకుండా యూట్యూబ్ అని చెప్పుకోవాలి. మీరు యూట్యూబ్ కు వెళ్లి గరుడ గమన అని టైప్ చేస్తే పదుల సంఖ్యలో వీడియోలు వస్తాయి. అందులో ప్రముఖ సింగర్స్ పాడినవి కూడా ఉంటాయి. ఈ సందర్బంగా picsartv.com వారు అందించిన ఈ పాటకు సంభందించిన వీడియో బాగా పాపులర్ అవటం గుర్తు చేసుకోవాలి. 5 మిలియన్ల వ్యూస్ తో ఈ వీడియో భక్త జనలను అలరిస్తూ ముందుకు దూసుకుపోతోంది. అంతగా ఈ వీడియో పాపులర్ అవటానికి కారణం …ఈ పాట పాడిన శృతిరంజనీ అయితే, సంగీతం అందించిందిన సాయి శ్రీకాంత్ గారు. సంప్రదాయ సంగీత కుటుంబం నుంచి వచ్చిన శృతి రంజనీ ఈ పాటను తన అద్బుత గాత్రంతో , తనదైన సంగీత శైలితో గానం చేసింది.