యువ సంగీత దర్శకుడు,గాయకుడు శ్రీనివాస శర్మ, రమ్య వైష్ణవి వివాహం

యువ సంగీత దర్శకుడు,గాయకుడు శ్రీనివాస శర్మ, రమ్య వైష్ణవి వివాహం విజయవాడలో లో ఈ నెల రెండవ తేదీ (బుధవారం) ఘనంగా జరిగింది. ది కృష్ణా జిల్లా రైస్ మిల్లర్స్ అశోసియోషన్ హాల్, గాంధీ నగర్ ,విజయవాడలో సద్ర్బాహ్మణ పరిషత్ యందు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దివ్య ఆశీస్సులతో సర్వాలంకార శోభితముగా ఈ జంట అగ్నిసాక్షిగా ఏడడుగులు వేశారు. సంప్రదాయబద్దంగా జరిగిన వీరి వివాహ మహోత్సవానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తరలివచ్చి ఆశీర్వదించారు. అలాగే ఈ వివాహానికి..లైలా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్,బిజేపి ఎంపి గోకరాజు గంగరాజు గారు, మాటీ టీటీడి ఛైర్మన్, ఎక్స్ ఎంపి కనుమూరి బాపిరాజుగారు కుటుంబ సమేతంగా వచ్చారు. ఐడీబీఐ డైరక్టర్ గా,ఎల్ ఐసీ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా చేసినటు వంటి కె.నరసింహమూర్తి గారు. అలాగే ఐజెంట్ డ్రగ్స్ అండ్ రీసెర్చ్ సొల్యూషన్స్ ప్రెవేట్ లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ డా.వర్మగారు, డా.దేవరాజన్ గారు వచ్చారు. ఈ వివాహంలో శ్రీనివాస శర్మ గారు గురువు గారు శ్రీ మోదుమూడి సుధాకర్ గారి సంప్రదాయ కచేరి ఈ వివాహంలో ప్రత్యేక ఆకర్షణ. అలాగే ఆ తర్వాత హైదరాబాద్ లో ఈ జంట తమ మిత్రులకు ,బంధువులకు హోటల్ మానస సరోవర్ (హైదరాబాద్ బేగంపేట)లో ఆరవతేదీ ఆదివారం రిసెప్షన్ ఎరేంజ్ చేసి, అతిథి సత్కారం చేసి, ఆశ్వీరచనాలు అందుకున్నారు. ఈ రిసెప్షన్ కి అనేక మంది సిని నేపధ్య గాయకులు, సంగీత దర్శకులు హాజరయ్యి..ఓ సంగీత సభలా మార్చేసారు. ముఖ్యంగా ఈ రిసెప్షన్ లో సుప్రసిద్ద సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాసరావుగారు ,సింగర్,మ్యూజిక్ డైరక్టర్ అయిన నీహాల్ గారు , ప్రముఖ సింగర్, సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్ గారు, పాడుతా తీయగా విన్నర్ తేజస్వని,అరుల్ కౌండిన్య, ఇండియన్ ఐడిల్ రేవంత్, సింగర్ అనుదీప్ ,వర్ధమాన గాయని శృతి రంజని హాజరయ్యారు. రిసెప్షన్ లో ఓ సంగీత కార్యక్రమం దాదాపు మూడు గంటలు సేపు జరిగింది. వీరితో పాటు శ్రీనివాస శర్మ సంగీత దర్శకత్వం చేసిన సినిమా “అల” కు చెందిన డైరక్టర్, హీరో,హీరోయిన్ మరియు టీమ్ అంతా వచ్చారు. హై కోర్ట్ న్యాయవాది సీనియర్ రవిచంద్ర గారు వచ్చారు. KKNKTV అథినేత ..డా.రాఘవేంద్ర గారు నాశిక్ నుంచి వచ్చారు.