మీరు ఔత్సాహిక గాయకులా అయితే ఈ వార్త మీ కోసమే
తెలంగాణలోని బాలలు, యువతీ యువకులు తమ గాత్ర ప్రావీణ్యతను పరీక్షించుకునేందుకు ఓ అవకాశం వచ్చింది. ఆల్ఫనా ఆర్ట్స్ సంస్థ సింగర్ ఆఫ్ తెలంగాణా పేరుతో…. తెలంగాణా స్టేట్ లెవిల్ సింగింగ్ కాంపిటేషన్ 2018 కు ఆహ్వానం పలుకుతోంది. ఔత్సాహిక గాయకుల్లో ఉన్న గాన ప్రతిభను వెలికితీయటానికి గానూ రాష్ట్ర స్థాయి పాటల పోటీలు నిర్వహిస్తోంది. ఈ సంస్ద నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందచేస్తామని విడుదల చేసిన ప్రకటనలో ఆ సంస్థ పేర్కొంది.
5నుంచి 10సంవత్సరాల వయసు బాలల ఒక క్యాటగిరిలో 11 నుంచి 18 సంవత్సరాల బాలలకు సబ్ జూనియర్స్, జూనియర్స్ కేటగిరిలో ఈ పోటీ నిర్వహిస్తారు. 19-25 మరియు 25 నుంచి ఇంకా పై సంవత్సరాల వారుకు కూడా సీనియర్స్, సూపర్ సీనియర్స్ కేటగిరిలో ఈ పోటి నిర్వహించబడుతుంది. ఆల్ఫానా ఆర్ట్స్. ప్రముఖ కవి స్వర్గీయ సి.నారాయణరెడ్డిగారిని గుర్తు చేసుకుంటూ,అంకితమిస్తూ ఈ కాంపినేషన్ ని నిర్వహిస్తున్నారు.
10 ఏప్రియల్ క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ 17 ఏప్రియల్, ఫైనల్స్ 22 ఏప్రియల్ లలో జరుగుతాయి. ఈ పోటీలో తెలుగు,హిందీ పాటలు మాత్రమే పాడాలి. పోటీలో పాల్గొనే ప్రతీ అభ్యర్దీకి సర్టిఫికేట్ అందచేస్తారు. ఆసక్తి ఉన్న వారు సమాచారం, రిజిస్ట్రేషన్ కోసం 8886660882, 8886660883 నెంబర్ల ను సంప్రదించాలని ఆ సంస్థ కోరింది.