ప్రతీ భారతీయుడు రోజుకి ఒక్కసారినా వినాల్సిన,పాడాల్సిన గీతం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ ‘వందేమాతరం’ గీతాన్ని తనదైన శైలిలో సంగీతం సమకూర్చి విన్నూతనంగా  ప్రెజెంట్ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఫిక్సర్ ఛానెల్ వారు కూడా మన  భారతీయలకు ఎంతో ఇష్టమైన ఆర్.ఎస్ ఎస్ వారి ప్రార్ధనా గీతాన్ని తమదైన శైలిలో స్వరపరిచింప చేసి  అందించారు.  ఈ గీతానికి  ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు సాయి శ్రీకాంత్ గారు పాడి, సంగీతం అందించారు.  నమస్తే సదా వత్సలే మాతృభూమేత్వయా హిన్దుభూమే సుఖవ్ వర్ధితోహమ్మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థేపతత్వేష కాయో నమస్తే నమస్తే || అంటూ  సాగే ఈ గీతం మన హృదయాలను సూటిగా తాకుతుంది. మన మాతృభూమిపై మనకున్న ప్రేమను తట్టి లేపుతుంది. ఖచ్చితంగా ప్రతీ భారతీయుడు వినాల్సిన ఈ గీతం మీ కోసం ..ఇక్కడ 

ఆర్.ఎస్ ఎస్ అనగానే క్రమ శిక్షణ గుర్తుకు వస్తుంది. ఖాఖీ నిక్కరు, తెల్ల చొక్కా చేతిలో లాఠీతో … సుశిక్షితులైన కార్యకర్తలతో మారు పేరుగా ఉంటుంది.  కేవలం భారతీయ విలువలను కాపాడటం మాత్రమే కాదు , ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం లోనూ ముందు ఉండటం, సంస్ద పుట్టినప్పటి నుంచీ మొదలైంది. యుద్ద సమయాల్లో  స్పందించటంలోనూ, ప్రజల్ని ఆదుకోవటంలోనూ   ఆర్.ఎస్ ఎస్ కార్యకర్తలు ముందుంటూ వచ్చారు.  నిత్యం అశాంతితో రగిలే ప్రాంతాల్లోనూ వేలాది మంది చిన్నారుల బాగోగుల్ని చూస్తోంది. తమ సేవాభారతి తరుపున డిల్లీ బోర్డింగ్ పాఠశాలల్లో విద్యనందిస్తున్నారు. వరదలు వచ్చినా, ఉప్పెనలు వచ్చినా ఆర్.ఎస్ ఎస్ కార్యకర్తలు ముందు ఉంటారు.  స్త్రీల కోసం ప్రత్యేకమైన విభాగం సైతం కలిగి ఉన్న ఆర్.ఎస్ ఎస్..1971లో బంగ్లాదేశ్ పోరాటం సమయంలో ఎంతోమంది క్షతగాత్రులకు రక్తదానం చేసి భాధితులకు ప్రాణం పోసి,వారి హృదయాల్లో శాశ్వత స్దానం పొందారు. దేశంలో రక్తదానం మాట వినపడటం అదే తొలిసారి కావటం విశేషం.   ఈ ప్రార్దనా గీతం యొక్క భావము – వాత్సల్య పూర్ణా! ఓ మాతృభూమీ! నేను నీకు ఎల్లప్పుడూ నమస్కరింతును. ఓ హిందుభూమీ, నీ వల్లనే నేను సుఖముగా వర్దిల్లినాను. మహా మంగళమయీ! ఓ పుణ్యభూమీ! నీ కార్య సాధనకై నా ఈ శరీరము సమర్పింపబడుగాక! నీకివే అనేక నమస్కారములు. సర్వశక్తిమన్! ఓ పరమేశ్వరా! హిందూ రాష్ట్రమునకు అవయవ స్వరూపులమైన మేము నీకు సాదరముగ నమస్కరించుచున్నాము. నీ కార్యము కొరకే కటి బద్ధులమైయున్నాము. దానిని నెరవేర్చుటకై మాకు శుభాశీస్సుల నిమ్ము. విశ్వము గెలువలేని శక్తిని, ప్రపంచము మోకరిల్లునట్టి సౌశీల్యమును, మేము బుద్ధి పూర్వకముగా స్వీకరించిన మా కణ్టకాకీర్ణ మార్గమును సుగమము చేయునట్టి జ్ఞానమును ప్రసాదింపుము. అభ్యుదయ సహిత నిశ్రేయమును పొందుటకై ఒకే ఒక ఉత్తమము, తీక్షణమునైన సాధనము వీర వ్రతము. అది మా అంతః కరణములయందు స్ఫురించుగాక! అక్షయము, తీవ్రమునైన ధ్యేయనిష్ఠ మా హృదయములలో ఎల్లప్పుడూ జాగృతమై యుండుగాక! విజయశీలియైన మా సంఘటిత కార్యశక్తి మా ధర్మమును సంరక్షించి, మా ఈ దేశమును పరమ వైభవ స్థితికి చేర్చుటలో నీ ఆశీస్సులచే మిక్కిలి సమర్థమగు గాక!