వందనం…’గురు వందనం’

పద్మ విభూషణ్, ప్రసిద్ధ వేణుగాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా 80 పుట్టిన రోజు వేడుకలు కేవలం ఆయన గృహంలోనే కాదు..ఆయన అభిమానుల గుండెల్లోనూ జరగనున్నాయి. ముఖ్యంగా సంగీత ప్రియులైన తెలుగువారి సమక్షంలో రేపు అనగా 22 ,జూలై 2018న జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ,టూరిజం శాఖ వారి సహకారంతో సుర్ మండల్ ఆర్గనైజేషన్ మరియు ఇవామ్ అకాడమీ కలిసి ఓ కార్యక్రమం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమ ముఖ్య అతిధి తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌, అలాగే విశిష్టఅతిథులుగా కళా తపస్వి ,ప్రముఖ సినీ దర్శకుడు,నటుడు కె. విశ్వనాథ్, శాంతా బయోటెక్స్ ఛైర్మన్ కె.వరప్రసాద్ రెడ్డి, తెలంగాణా ప్రభుత్వ సలహాదారు డా. కె.వి రమణాచారి. అలాగే గౌరవ అతిధులుగా…బి. వెంకటేశం ఐ.ఎ.ఎస్, ప్రముక పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, శ్రీ వినోద్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో జరగనుంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ..గురువందన సమర్పణ చేసేది..ప్రముఖ సంగీత విద్వాంసులు తాళ్లూరి నాగరాజు గారు. ‘ప్లూట్ .నాగరాజు’ గా విశిష్ట ఖ్యాతి పొందిన నాగరాజు గారి ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న తెలుగు తేజం ఆయన. ఆయన హరిప్రసాద్ చౌరాసియాగారి మీద ప్రేమతో ..అంతకు మించి అభిమానంతో చేస్తున్న పోగ్రాం ఇది. మొదట చెన్నై నుంచి వస్తున్న స్ట్రింగ్ సెక్షన్ తో మొదట నలభై నిముషాలు సింఫనీ వాయిస్తున్నారు. ఆ తర్వాత హరిప్రసాద్ చౌరాసియా గారికి సత్కారం ఉంటుంది. తర్వాత ఆయన కంపోజ్ చేసిన సినిమాలు సిల్ సిలా, డర్ ,చాందిని వంటి సినిమాల్లో పాటలు పాడతారు. అలాగే ఆయన వాయించిన సిరివెన్నెల సినిమా నుంచి పాటలు అవీ పాడతారు. ఇన్ని విశేషాలతో ఆడియన్స్ ను అలరించటానికి రెడీ అవుతున్న ఆ స్టేజీపై ఏ అద్బుతం జరగనుందో… వీక్షిద్దాం. వెన్యూ వివరాలు..

రవీంద్రభారతి ,హైదరాబాద్ 22,జూలై 2018, సాయింత్రం 6: 30