మహాత్మునికి మహోజ్వల నివాళి

ఈ సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉంది. జాతిపిత మహాత్మా గాంధి 150 వ జయంతిని మనమంతా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరంలో వచ్చే ఆయన వర్దంతికి జాతి మొత్తం నివాళి అర్పించేందుకు సిద్దమౌతోంది. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ… ఇప్పటికే జాతిపిత గాంధీ సిద్దాంతాలను, ఆశయాలను విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా …’మీకు చేతనైన..నచ్చిన పద్దతిలో మహాత్ముడుకి నివాళి ఇవ్వండి’ అంటూ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. అందుకోసం gandhi.gov.in అనే వెబ్ సైట్ ని సైతం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో తమ వంతు భాధ్యతగా sanskritTv.com వారు గాంధీకు ఎంతో ఇష్టమైన జాతీయగీతాన్ని….” వందేమాతరం 150″ ఆల్బమ్ గా విడుదల చేసారు. ఈ ఆల్బమ్ ప్రత్యేకత ఏమిటంటే… 150 కర్ణాటక రాగాలతో ‘వందేమాతరం’ ఆలపించటం. బాల గాయని అత్తలూరి ప్రవస్తి…ఈ దేశభక్తయుక్త సంగీత ప్రయోగం చేసింది. 12 సంవత్సరాల ఈ గాయని,150 రాగాలని స్వంతంగా స్వరపచుకుని ఆలపించటం విశేషం. భారత స్వాతంత్య్రోద్యమకారుల్లో అపురూపమైన పోరాట స్ఫూర్తిని రగిలించి, స్వరాజ్య సాధన ఉద్యమ ప్రస్థానాన్ని మలుపుతిప్పిన మహోజ్జ్వల గీతం ‘వందేమాతరం’. ఆనాటి స్వేచ్ఛా కాంక్షకూ, పోరాట దీక్షకూ ప్రతీకలుగా నిలిచే ఈ గీతం మన జాతీయ గీతమై విరసిల్లుతోంది. ఈ”వందేమాతరం 150″ ఆల్బమ్ వీడియోని చూడాలనుకున్న వారు www.SanskritTv.com ని దర్శించండి.లేదా… 9885 110 110 కి ఫోన్ చెయ్యండి.